Friday, September 13, 2024

హ్యుందాయ్ మెగా అడుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ని దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాలని ప్రణాళికలు రచిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటి వ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఆధునిక టెస్ట్ కార్ల త యారీ సౌకర్యం (ఈవీలు) కూడా ఉంటాయి. అలాగే హై దరాబాద్‌లో ఉన్న ఇంజనీరింగ్ కేందం పునరుద్ధరణ, ఆ ధునీకరణ, విస్తరణ ద్వారా హెచ్‌ఎంఐఈ భారతదేశం స హా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబులతో చర్చల అనంతరం హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని,

భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. ఆధునిక పరీక్షా సౌకర్యాలు అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర పంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణ లో పెట్టించేందుకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నా రు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబం ధ సంస్థ హెచ్‌ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందన్నారు.రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నే హపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్రగతిశీల, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్‌ఎంఐఈ వంటి అత్యున్నత కంపెనీలు ముందుకు వస్తున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. హెచ్‌ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉందని, ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు.

త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్ కార్ప్ సుముఖత
తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాలో బిజీ బిజీగా గడుపుతోంది. అమెరికా పర్యటనను విజయవంతంగా ముంగించుకొని దక్షిణ కోరియా చేరుకున్న ముఖ్యమంత్రి బృందం సోమవారం సియోల్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాల్లో ఒకటైన ఎల్‌ఎస్ కార్ప్ (గతంలో ఎల్‌జీ గ్రూప్‌లో భాగస్వామి) చైర్మన్ కూ జా యన్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్టు ట్విట్టర్ వేదికగా సిఎంఓ తెలిపింది.

కొరియా బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో
కొరియా పెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (కేఓఎఫ్‌ఓటీఐ) నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేండ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హాజరైంది. ఈ సందర్భంగా వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం అని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సిఎం ఆహ్వానించారు. సిఎం ఆహ్వానంపై యంగ్ గోన్ చైర్మన్ కిహాక్ సంగ్, కేఓఎఫ్‌ఓటీఐ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూతో పాటు 25 ప్రధానమైన టెక్స్‌టైల్ కంపెనీలకు చెందిన అగ్ర నాయకులు ఉత్సాహంతో ప్రతి స్పందించారు. ఈ సమావేశంతో టెక్స్‌టైల్ రంగంలో వరంగల్ తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు మరిన్ని పెట్టుబడులు ఆకర్శిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకునేలా మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కలిసి ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సిఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News