Sunday, December 3, 2023

నాడు ఎట్లుండే… నేడు ఎట్లయింది!

- Advertisement -
- Advertisement -

ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నాము. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తున్నారు. అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని, సంక్షేమాన్నే గాకుండా పారిశ్రామిక విధానంలో రూ. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సమగ్ర జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం విశేష కార్యక్రమాలు. గతంలో రాష్ట్రం ఏర్పడితే నష్టపోతామని అవహేళన చేసిన దశ నుంచి దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రంగా, నేడు అభివృద్ధిలో దేశానికే మోడల్‌గా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. సర్వతోముఖాభివృద్ధి కోసం సంపద పెంచాలి, పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది.

రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. సకలజనులకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. అవసరమైన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకూ పెద్దపీట వేస్తూ సంక్షేమమే లక్ష్యంగా ముందుకుపోతున్న ఒకే ఒక్క రాష్ట తెలంగాణ. సాగునీటి వనరుల పెరుగుదలతో అన్ని రంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతోంది. మరోవంక తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్ని రంగాలనూ బలోపేతం చేయడంతో పాటు, అభివృద్ధి అంటే ఏమిటో అనతి కాలంలోనే దేశానికి చాటి చెప్పగలిగాం. పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం పాలనా సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించింది. ఇంటింటికీ చేరుతున్న ఫలాలు ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు వినూత్న పథకాల అమలు తీరు గొప్పగా ఉంది. అడగకుండానే కెసిఆర్ అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రై

తు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలుతో పట్టు, పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే, వారి సంబంధీకులకు ఆ పింఛన్ వెంటనే బదిలీ చెయ్యడంలో ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అర్ధం పడుతుంది. బిసి బంధు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమేనని, మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహాలో పథకాలు దేశంలో ఎక్కడ లేవు. ఇల్లు కట్టడం, పెండ్లి చెయ్యడం ఒకప్పుడు ఏ పేద కుటుంబానికైనా ఈ రెండూ పెను సవాళ్లు మారేవి. బిడ్డ పెండ్లి చేసిన తర్వాత పురుళ్లు మరో పెద్ద బాధ్యత, ఇక పిల్లల చదువు. చదువుకు తగిన ఉపాధికి నిత్యం ఎదో ఒక్క సమరమే దానికి తోడు ఇంట్లో ఉన్న వృద్ధుల బాధ్యత. ఇంటిల్లిపాది పోషణ అరకొర ఆదాయాలతో బతుకీడ్చడంతో దుబాయ్‌కో, బొంబాయికో వలస పాలే, గత ఉమ్మడి పాలనలో గగనమైన రోజులు ఇదే గోస! తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తేనే బతుకు భారంగా ఉండే. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజ ల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. నేడు దేశానికే ఆదర్శం తెలంగాణ.

ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశంవలే తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. తాపత్రయపడే పాలకుల హయాంలో.. రైతులను, కార్మికులను పట్టించుకోని సమైక్య రాష్ట్రంలో ప్రజల వ్యథాభరిత జీవన దృశ్యమిది. ఇప్పుడు ఆ దృశ్యం మారుతున్నది, సొంత రాష్ట్రంగా తెలంగాణలో సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సిఎం కెసిఆర్ సంక్షేమయజ్ఞం చేస్తున్నారు. ఒకటా.. రెండా.. అనేక పథకాలు.. ఒక పేద కుటుంబం సమగ్రంగా మెరుగైన జీవితం గడిపేందుకు భరోసానిస్తున్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి! నా తెలంగాణాలో స్వతంత్ర భారత దేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉంది. ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం నుండి సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.

అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతిఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ పథకాలను రూపొందించి విస్త్రృత స్థాయిలో అమలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు దాదాపు కోటిన్నర మందికి చేరుతున్నాయి. ఒకనాడు కరెంట్ కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ. ప్రభుత్వం చేసిన అవిరళమైన కృషితో నేడు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నది. వ్యవసాయం కుదేలైపోయి విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించింది. తాగు నీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, తెలంగాణ వంద శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా నల్లాల ద్వారా స్వచ్ఛమైన సురక్షిత జలాలను సరఫరా చేస్తున్నది. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటి రంగంలో మేటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక విప్లవం వచ్చింది,

ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి గ్రామీణ, పట్టణ నిరుపేదలకు లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతున్న ప్రయత్నాలకు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాల ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి ఒకనాడు భారమైతే నేడు వేడుకగా మారింది. ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే, బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచింది. గతంలో కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు, దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే 3016 నుంచి 5,016 రూపాయలకు పెంచుకున్నాం. దశలవారీగా ఆసరా పెన్షన్ రూ. 5,016కు పెంపు. మొదటి సంవత్సరంలో రూ. 3,016.. దశల వారీగా ఐదేళ్లలో రూ. 5,016 వరకు పెంపు. ఇది నిస్సహాయులు ఆత్మగౌరవంగా బతకడానికి సిఎం కెసిఆర్ ఇస్తున్న భరోసా. 2014 నాటికి పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా,

ఇవాళ 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నం. వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులతో పాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్ని వర్గాల వారికి కూడా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించింది. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కెసిఆరే కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడిగా భావిస్తున్నారు. నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలా డుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాంలు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమథనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News