Tuesday, April 30, 2024

మేడిగడ్డ, అన్నారం ప్రమాదాలకు కేంద్రానిదే బాధ్యత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలలో ప్రమాదాలు జరగటానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పర్యావరణ ,భూగర్భ నిపుణులు పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా ఉన్న ఈ బ్యారేజిలలో ప్రస్తుతం కొంతమేరకు మాత్రమే ప్రమాదం జరిగిందని , భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యావరణ , భూగర్భ నిపుణులు నరసింహా రెడ్డి , దిలీప్‌ రెడ్డి , బి.వి సుబ్బారావు మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

నీటి ఉధృతి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే బ్యారేజిని నిర్మించారని తెలిపారు. స్థానిక భౌగోళిక లక్షణాలు , డిజైన్ లోపాలు, నిర్మాణ పనుల నాణ్యత ప్రాజెక్టుల పరిసరాల్లో కొనసాగుతున్న బొగ్గు తవ్వకాలకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు డిజైన్లను సమగ్రంగా పరిశీలన చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వల్లనే ఇటు వంటి ప్రమాదాలకు అవకాశాలు ఏర్పడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Kaleshwaram

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News