Wednesday, May 22, 2024

మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలి: సిపిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కి ఉదయం 11 గంటలకు ప్రాంతానికి చేరుకొని బ్యారేజ్ లోనీ కుంగిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ ని తాత్కాలిక మరమ్మత్తులు చేసి రైతులకు నీరు అందించాలని అన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్ లో నే అత్యధిక ఖర్చు చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని, పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ కుంగిపోవడం దారుణమని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగిపోవడం పై న్యాయ విచారణ చేసి బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కరువు ఏర్పడుతుందని ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కొనసాగించాలా లేదా తర్వాత ఆలోచించండి కానీ ప్రస్తుతం రైతులకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని సిపిఎం నాయకులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News