Monday, April 29, 2024

ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికే ఓటు వేసినవాళ్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిశాక కానీ ఎగ్జిట్ పోల్స్ రావడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధన ఉంది. దీంతో సాయంత్రం ఆరున్నర గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. ఇవి ఎలా ఉంటాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తూండటంతో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రం కేసీఆర్ కు పరాభవం తప్పదంటూ చెప్పారు. చివరకు ఆయనే పరాభవం పాలై, పోల్ సర్వేలకు, రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు.

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 79నుంచి 91 సీట్లు, మహాకూటమికి 21నుంచి 33 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేయగా టీఆర్ఎస్ 50-65 సీట్లు, మహాకూటమి 38-52 సీట్లు గెలుచుకుంటాయని టైమ్స్ నౌ అంచనా వేసింది. లగడపాటి చేయించిన సర్వేలో మహాకూటమికి 65 సీట్లు వస్తాయని, టీఆర్ఎస్ 35 సీట్లతో పరాజయం పాలవుతుందని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News