Saturday, September 23, 2023

దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

అభివృధ్ది, సంక్షేమం, పరిపాలనతో సహ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర సమాచార, సాంకేతి క, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి క ల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సిరిసిల్లలో అమరవీరులకు నివాళులర్పిం చి, మంత్రి కెటిఆర్ తన క్యాంపు కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి ఎదగడం మ నందరికీ గర్వకారణమన్నారు.

సిఎం కెసిఆర్ మా నవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచ న, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పాలనతో తెలంగాణ మోడల్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతోందన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభా లు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలిచిందన్నారు. సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహ ణ చేస్తూ ప్రజాసంక్షేమ పథకాలను భారీ ఎత్తున ని రాటంకంగా అమలు చేయడం కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సాధ్యపడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగ ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృధ్ధి సాధిస్తూ తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు.తెలంగాణ ప్రజలకు మొదటినుండి సామాజిక, ఆర్థిక లక్షాలను సాధించే చైతన్యం ఉందని అందుకే తొమ్మిదేళ్లలో సమాజ సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం చేసే ఖర్చుఅనేక రెట్లు పెరిగిందన్నారు.

రాష్ట్రాల ఆదాయం పెంపు విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ కూడా తొమ్మిదేళ్లలో రెట్టింపుకన్నా ఎక్కువైందన్నారు.రానున్న రోజు ల్లో జాతి నిర్మాణంలో తెలంగాణ మరిం త ఉజ్వల పాత్ర నిర్వహించే విధంగా పురోగమిస్తోందన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగుబలహీన వర్గాలప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణ వికాసం సాధించేవరకు విశ్రాంతి విరామం లేకుండా పరిశ్రమిద్దామన్నారు.ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిద్దామన్నారు. ఇందుకోసం రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామన్నారు. తమ మహా సంకల్పానికి తెలంగాణ ప్రజలు అండదండలు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 22 వరకు పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణ కీర్తిని దశదిశలా చాటాలన్నారు.

అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ అన్ని రంగాల్లో అంతకు ముందెన్నడు లేని విధంగా గణనీయంగా అభివృధ్ధి సాధిస్తోందన్నారు. ఈ సందర్బంగా సిరిసిల్ల జిల్లాలో అమలవుతున్న అభివృధ్ధి, సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో సహ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు రమేశ్‌బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పవర్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్‌పి చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి,ఎస్‌పి అఖిల్ మహజన్‌తో పాటుగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News