Tuesday, December 10, 2024

8 మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా జి.సౌజన్య, వైస్ చైర్ పర్సన్‌గా హోన్నపవర్ పరమేశ్‌ను ప్రభుత్వం నియమించింది. హుజూరాబాద్ అగ్రికల్చర్ మా ర్కెట్ కమిటీకి చైర్‌పర్సన్‌గా గూడూరి రాజేశ్వరిని, వైస్ చైర్ పర్సన్‌గా నామ్‌పెళ్లి తిరుపతిని నియమించారు. కమలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా తోటమ్ ఝాన్సీ రాణిని, వైస్ చైర్ పర్సన్‌గా దేశిని ఐలయ్యను, జైనూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా కూడమేథ విశ్వనాథ రావు, వైస్ చైర్ పర్సన్ గా బానోత్ జాయివంత్‌ను, కొడకండ్ల మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా నల్ల అండాలు, వైస్ చైర్ పర్సన్ గా దేశగాని నాగరాజుని నియమించారు.

అలాగే పాలకుర్తి మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా లావుడ్య మంజుల, వైస్ చైర్ పర్సన్‌గా ఏనుముల మల్లారెడ్డిని, హైదరాబాద్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా చెకోలేకర్ లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ గా కోట్ల శ్రీనివాస్‌ని నియమించారు. మెట్‌పల్లి మార్కెట్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూన గోవర్ధన్, వైస్ చైర్ పర్సన్‌గా తిప్పిరెడ్డి అంజి రెడ్డిని నియమించారు. దీంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 113 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News