Sunday, April 28, 2024

డిఎస్‌సి నోటిఫికేషన్ రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ఏడాది ఇచ్చిన డిఎస్‌సి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. 2023లో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరీక్ష వాయిదా పడ్డాయి. తాజాగా పాత డిఎస్‌సి 2023 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది.

డిఎస్‌సి కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. విద్యా శాఖ ప్రతిపాదించిన 11,062 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్‌సి విడుదల చేయనుంది. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే దరఖాస్తుల ప్రారంభించనున్నారు. మే నెల మూడో వారంలో 10 రోజుల పాటు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. టీచర్ పోస్టుల సంఖ్య పెరగడంతో గత డిఎస్‌సి కన్నా పెరుగనున్న నేపథ్యంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కొత్తగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు
కొత్త డిఎస్‌సి నోటిఫికేషన్‌లో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేలా ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు డిఎస్‌సి ద్వారా భర్తీ చేయలేదు. కానీ ఈ నోటిఫికేషన్‌లో మాత్రం 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News