Friday, March 29, 2024

అన్ని గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్‌గా….

- Advertisement -
- Advertisement -

పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్‌గా…
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో పథకాల పురోగతిపై సిఎస్ సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, గామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాల గురించి అధికారులతో సిఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, హరితహారం లాంటి రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాల వల్లే వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్‌గా మారాయని సిఎస్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగడంతో పాటు గ్రామ పంచాయతీల్లో పాలన మెరుగుపడిందన్నారు. డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గడం, గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని శాంతికుమారి పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చడం జరిగిందని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని సిఎస్ తెలిపారు.

52.78 లక్షల జాబ్ కార్డుల జారీ..

ఉపాధి హామీ పథక పురోగతిపై సిఎస్ సమీక్షిస్తూ రాష్ట్రంలో1.11 కోట్ల మందికి 52.78 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్లు సిఎస్ తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు, సిసి రోడ్లు మొదలైన వాటి నిర్మాణం పూర్తి చేసినట్టు సిఎస్ వెల్లడించారు. వాటర్‌షెడ్ కార్యక్రమం (ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన) కింద 200 అమృత్ సరోవర్లను నిర్మించినట్లు సిఎస్ తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేజ్-11 కింద 42 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 11,60,920 వ్యక్తిగత సోక్ పిట్లు, 32,650 సామాజిక సోక్ పిట్లను నిర్మించినట్లు సిఎస్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News