Friday, April 19, 2024

ఈనెల 22 తరువాత ‘గృహలక్ష్మి’ మార్గదర్శకాలు ఖరారు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సిఎం కెసిఆర్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఖరారు చేసిన మార్గదర్శకాల్లో సవరణలను ఫైనల్ చేసే బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు సిఎం కెసిఆర్ అప్పగించారు. ఈ నెల 22వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ముగియగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని హౌసింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్కీమ్‌ను మహిళ పేరు మీద ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ అని పేరు పెట్టింది. సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే ‘గృహలక్ష్మి’ పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనుంది.
ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు లబ్ధిదారులు
ఈ పథకం కింద ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు లబ్ధిదారులను గుర్తించి వారికి తొలి విడతగా రూ. లక్ష సాయం చేయనున్నట్లుగా తెలిసింది. లబ్ధిదారులను ఫైనల్ చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా లిస్ట్ ఫైనల్ చేసి కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను 3 విడతలుగా ప్రభుత్వం సాయం అందించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గానికి 3 వేల ఇళ్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాల నుంచి 250 గజాలు, పట్టణాల్లో 80 గజాలు ఉంటే లబ్ధిదారులు అర్హులుగా ప్రభుత్వం ఖరారు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News