Friday, April 26, 2024

బ్రాప్‌లో తెలంగాణ టాప్ 3

- Advertisement -
- Advertisement -

Telangana is top 3 in BRAP

7 వ్యాపార సానుకూల రాష్ట్రాల్లో చోటు
ర్యాంకులతో ఆర్థికమంత్రి నిర్మల నివేదిక
సంస్కరణల అమలుపై సముచిత పోటీ

న్యూఢిల్లీ : దేశంలో వ్యాపార సరళీకృత విధానాల ర్యాంకింగ్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏడు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2020 నాటి వ్యాపార సంస్కరణల పథకాన్ని సమగ్రంగా అమలుపర్చిన ఘనత వహించిన రాష్ట్రాలకు ర్యాంకులను ఖరారు చేశారు. ఈ ర్యాంకుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తమ నివేదికలో పొందుపర్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియలో వ్యాపారాలకు ముందుకు వచ్చే వారికి సరైన సరళీకృత విధానాలను ఖరారు చేయడం కీలక అంశంగా ఉంది. ఈ దిశలో అత్యున్నత ఫలితాలు సాధించిన జాబితాలో ఏడు రాష్ట్రాలు ముందువరసలో నిలిచాయి. ఒకటో స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో గుజరాత్ నిలిచాయి. మూడో స్థానంలో తెలంగాణ ఉంది.

తరువాత సంఖ్యలో హర్యానా, కర్నాటక, పంజాబ్, తమిళనాడులు ఫలితం సాధించాయి. ర్యాంకింగ్‌లలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లు ఫలితాలను రాబట్టిన రాష్ట్రాలుగా ఉన్నాయి. రాష్ట్రాలలో పెట్టుబడుల సమీకరణకు సరైన వాతావరణం కల్పించేందుకు తద్వారా పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు మార్గాలు ఏర్పడేందుకు వ్యాపార సానుకూల సంస్కరణల కార్యాచరణ పథకం (బ్రాప్) అమలు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో సాగాలని కేంద్రం సంకల్పించింది. ప్రతి ఏటా సంబంధిత అంశంపై రాష్ట్రాల ముందడుగును బేరీజు వేసుకుని ర్యాంకులు ఖరారు చేయడం జరుగుతోంది. ఈ దశలో ఇప్పుడు ఎపి, గుజరాత్, తెలంగాణలు వరుసగా ఒకటి రెండో మూడో స్థానాలలో నిలిచాయని నివేదికలో తెలిపారు. వ్యాపారులకు ఎటువంటి సంక్లిష్టత లేకుండా చేయడం, నిబంధనల సడలింపు, సంక్లిష్టతలు లేకుండా చేయడం వంటివి కీలకంగా సంస్కరణల ప్రక్రియలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News