Saturday, July 27, 2024

ఓట్ల కోసం నోట్ల వర్షం..

- Advertisement -
- Advertisement -

municipal-elections

హైదరాబాద్: నగర శివారులో జరిగే మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్దులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నోట్ల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు. ప్రత్యర్దులు ఢీకొనేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మంది, మార్బలంతో కాలనీ, బస్తీలో జెండాలు చేతపట్టి ఓటర్లకు దండాలు పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో 07 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లోని 215 మున్సిపల్ డివిజన్లు, 425 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరుతుండగా అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్,బిజెపి పార్టీలు బరిలో నిలిచి మెజార్టీ సీట్లు సాధించుకునేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీ సీనియర్లు అభ్యర్దులు ఓటర్ల తమ వైపు తిప్పుకునేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలో సూచనలు చేస్తున్నారు. సామ,దన,బేద దండోపాయలతో ఓట్లు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మున్సిపల్ డివిజన్‌కు రూ. 2కోట్లు, వార్డుల్లో రూ.1.50కోట్లవరకు ఖర్చు చేసేందుకు అభ్యర్దులు తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుచరులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే కాలనీ,బస్తీ, మహిళ సంఘాలకు రూ. 10లక్షలవరకు ఖాతాలో జమ చేశారు. ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజుల ఉండటంతో ప్రతి అభ్యర్ది ప్రచారానికి అరడజన్ వాహానాలు సిద్దం చేసుకుని ద్వితీయ శ్రేణి నాయకులను వెంట తిప్పుకుంటూ గడప గడపకు బొట్టు పెడుతున్నారు. ప్రచారానికి వెళ్లే ముందు స్దానిక యువతతో 50 ద్విచక్ర వాహనాల ఏర్పాటు చేసుకుని ర్యాలీగా వెళ్లుతూ రోజుకు ఒక యువకుడికి రూ. 1500, బిర్యానీ బోజనం చేయిస్తున్నారు. ప్రచారానికి అభ్యర్ది వెంట అడుగులో అడుగేసే వారు 50మంది వరకు ఉండటంలో వారికి రోజుకు రూ. 500 నగదు ఖరీదైన ఆహారం తినిపిస్తున్నారు. రోజు వారీగా ఖర్చులు రూ. 1.50లక్షలవరకు ఖర్చు చేస్తున్నట్లు అభ్యర్దులు అనుచరులు వెల్లడిస్తున్నారు. ఇకా రాత్రి వేళ ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. బస్తీ,కాలనీకు చెందిన యువకులు, ముఖ్యులకు స్దానికంగా ఉండే దాబాలు, హోటల్‌ల్లో ,పంక్షన్‌ల్లో విందు ఏర్పాటు చేస్తూ రోజుకు రూ. 5లక్షలు ఖర్చు చేస్తున్నారు.

ఎన్నికలకు చివరి రెండు రోజుల్లో యువ ఓటర్లకు సెల్‌పోన్లు, కంప్యూటర్లు, మహిళలకు బంగారు ఉంగరాలు, పట్టు చీరలు పంపిణీకి సిద్దం చేస్తున్నారు. తటస్దంగా ఉన్న ఓట్లరకు రూ. 2వేలు నుంచి రూ. 5వేలకు వరకు అందజేస్తామని స్దానిక లీడర్లు వారికి గాలం వేస్తున్నారు. ఇతర పార్టీ నాయకులకు ఓట్లు వేస్తే కాలనీలు అభివృద్ది చేయకుండా అక్రమాలకు పాల్పడుతారని, తమకు ఓటు వేస్తే అభివృద్ది ఏమిటో చూపిస్తానని, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, కళ్యాణలక్ష్మిపథకం, ప్రతి వీధికి సిమెంటు రోడ్లు వేసి మున్సిపాలిటీ రూపు రేఖలు మారుతామని ఊదరగొడుతున్నారు. ప్రత్యర్ది పార్టీ అభ్యర్దులు అవినీతి పాల్పడుతారని, ప్రభుత్వం పథకాలు అందకుండా జేబులో వేసుకుని పేదలను విస్మరిస్తారని పేర్కొంటూ తమ పట్టం కట్టాలని దండాలు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు తలదన్నేలా మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్ధులు ధన ప్రవాహం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telangana Municipal Elections 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News