Friday, April 26, 2024

‘సృజన చిరునామా’ చిన్నారులే

- Advertisement -
- Advertisement -

Telangana School Innovation Challenge 2021-22

 

దానిని వెలికితీస్తే అద్భుతాలే

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ మంత్రి కెటిఆర్
కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ కావాలి
మా చిన్నతనంలో అమ్మమ్మ ఊరు కొదురుపాకలో మిత్రులతో కలిసి కొత్తకొత్త ప్రయోగాలు చేసేవాళ్లం
పిల్లలను చూసి గతంలోకి వెళ్లిన మంత్రి

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తేనే వాళ్లలోని ప్రతిభ బయటపడుతుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గోల్కొండలోని తారామతి, బారదరిలో తెలంగాణ స్కూల్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి కెటిఆర్ , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి, లేకపోతే వెనుకబడిపోతామని విద్యార్థులకు సూచించారు. కరోనా తర్వాత ఇంతపెద్ద ఎత్తున పాఠశాలలు ఇన్నోవేషన్ పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 5,387 పాఠశాలలు 11,037 సరికొత్త ఆవిష్కరణలతో 25,166 మంది విద్యార్థులు ఈ ఇన్నోవేషన్ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమని, వారందరికీ అభినందనలు తెలిపారు. పసితనంలో పిల్లలకు సృజనాత్మకత అధికంగా ఉంటుందని, తన చిన్న తన్నంలో తమ అమ్మమ్మ ఊరు కొదురుపాకలో మిత్రులతో కలిసి కొత్తకొత్త ప్రయోగాలను చేసేవాళ్లమంటూ కెటిఆర్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలను డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అంటూ తల్లిదండ్రులు మూసా ధోరణిలో వెళ్లుతున్నారని దీంతో చాలామంది పిల్లలకు బియ్యం, పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పిల్లల్లో సహజంగా ఉంటే తెలివిని గుర్తించి పదును పెడితే వారే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్న విషయం మరవరాదని తెలిపారు. విద్యార్థుల్లో ఉంటే ప్రతిభను వెలికితీసేందుకే తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. జపాన్ దేశంలో అక్కడి విద్యార్థులు రెండు మూడు తరగతుల నుంచే కంపెనీలు, మ్యూజియాల చుట్టూ తిప్పుతుంటారని తద్వారా వారు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. వారిని ఈ విషయంలో అభినందించాల్సిందేనని, తను గత మూడు, నాలుగేండ్ల క్రితం జపాన్‌లోకి సుజికి కంపెన్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గమనించనన్నారు. రెండు, మూడు తరగతులు చదువుతున్న విద్యార్థులు అక్కడి తిరుగుతూ ఏమి పరిశీలిస్తున్నారో తెలియక అక్కడి ఎగ్జిక్యూటివ్‌తో అడిగానని, అయితే మీరే గమనించాలని ఆయన సూచించడంతో ఆ చిన్నారులు వెండిండ్ మిషన్స్‌ను పరిశీలిస్తున్నట్లు గుర్తించానని మంత్రి కెటిఆర్ తెలిపారు.

తెలంగాణలో ఇన్నోవేషన్‌కు పెద్దపీట

తెలంగాణలో ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో అవార్డులను ఇవ్వడం ద్వారా నూతన ఆవిష్కరలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా విద్యాశాఖలో వై హబ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్‌ను ప్రారంభించున్నామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశీస్సులతో రాష్ట్రంలో విద్యా యజ్ఞం ప్రారంభమైందని, మన ఊరుమన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా అభివృద్ది చేసుకుంటున్నామని వెల్లడించారు. ఇ ందులో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నీచర్ డిజిటల్ క్లాస్ రూములు, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకుండా అత్యుత్తమ బోధన అందించేందుకు డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News