Wednesday, April 17, 2024

బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకరు కాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరొకరు. తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఆయన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. తుక్కుగూడలో శుక్రవారం జరిగే సభలో ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిశారు. మణుగూరులో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభకు కూడా హాజరయ్యారు. ఇక ఇల్లెందులో మంగళవారం జరగిన మహబూబాబాద్ లోక్ సభ స్థాయి కాంగ్రెస్ భేటీలో కూడా వెంకట్రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News