Sunday, October 6, 2024

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిడటంతో అధికారులు రహదారులను మూసివేశారు. దంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు రెండు రోజులుగా కేదార్ నాథ్ లోనే చిక్కుకుపోయారు.

వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన తెలుగు వారు సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పారు. ఇవాళ హెలికాప్టర్ రావాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రోజులు అక్కడే ఉండాల్సి రావొచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News