Monday, April 29, 2024

తెలంగాణకు వడగాలులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదిలాబాద్ , ఖమ్మం, ములుగు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామబాద్ ,నల్లగొండ, కొత్తూగూడెం, సూర్యాపట, భూపలపల్లి, వరంగల్ ,హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ , వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి.

వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో ఒక మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కరీంనగర్ ,పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ , హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి , రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చెల్ మల్కాజిగిరి , వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ , నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుముల మెరుపులుతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News