Friday, May 3, 2024

పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్‌లో ఉగ్రవాద దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్‌లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్, చైనాలు కుట్రపన్నుతున్నాయని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో అయిదుగురు జవాన్లు మృతి చెందిన ఘటన తర్వాత ఆర్మీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ లోయలో ముఖ్యంగా పాక్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో ఇటీవలి కాలంలో భారత రక్షణ దళాలపై దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. పాక్, చైనా ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహమే హింస పెరగడానికి కారణమని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.

భద్రతా దళాలపై దాడులు చేయడం ద్వారా వారిని రెచ్చగొట్టే ఉద్దేశంతో పాక్ ఇటీవలి కాలంలో 25 30 మంది ఉగ్రవాదులను పూంఛ్ సెక్టార్‌లోకి అక్రమంగా ప్రవేశపెట్టిందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. 2020 నాటి గల్వాన్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత లడఖ్‌లో భద్రతా దళాలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఇది ఏమాత్రం గిట్టని చైనా ప్రభుత్వం భారత బలగాలను అక్కడినుంచి తిరిగి కశ్మీర్‌పై దృష్టిపెట్టేలా చేయాలని యోచిస్తోందని ఆ వర్గాలు తెలిపారు. పశ్చిమ సరిహద్దుల్లో తిరగి ఉగ్రవాదాన్ని రాజేయడం ద్వారా భారత సైన్యం దృష్టిని తూర్పు వైపునుంచి మరల్చడానికి చైనా మద్దతుతో పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని కూడా వారు అంటున్నారు. 2020లో భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక దళమైన రాష్ట్రీయ రైఫిల్స్ దళాన్ని పూంచ్‌నుంచి లడఖ్ ప్రాంతంలో మోహరించడం చైనా అనుమానాలకు బీజం వేసింది. సరిహద్దుల్లో చైనాకు వ్యతిరేకంగా భారత బలగాల సామర్థాన్ని పెంచడానికి ఇది తోడ్పడింది కానీ పూంఛ్ రంగంలో ఉగ్రవాద వ్యతిరేక బలాల సామర్థం తగ్గిపోయింది.

దట్టమైన అటవీ ప్రాంతమైన పూంఛ్ ఏరియాలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం ప్రస్తుతం చేస్తున్న పోరాటం ఒకప్పటి ‘ఆపరేషన్ సర్ప్‌వినాశ్’ను తనకు గుర్తు చేస్తోందని రక్షణ నిపుణుడు కల్నల్ మనోజ్ కుమార్ అంటున్నారు. 2003లో పూంఛ్ లోని సురాన్ కోట్ ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. సర్ప్ వినాశ్ సమయంలో ఉపయోగించిన ఇప్పుడురహస్య స్థావరాలను, బేస్‌లనే ఇప్పుడు కూడా ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు. ఆ ఆపరేషన్ కోసం 15 వేల బలగాలను ఉపయోగించగా, 65 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ‘ఇప్పుడు ఈ ప్రాంతాల్లో శాంతికి భంగం కలిగించడం ద్వారా చైనా సరిహద్దులనుంచి ఇక్కడ బలగాలను తిరిగి మోహరించేలా చేయడానికి పాక్, చైనాలు కుట్రపన్నుతున్నాయి’ అని ఆయన ఎన్‌డిటీవీతో అన్నారు. ఉగ్రవాద ముప్పును తిప్పికొట్టడానికి ఆర్మీ ఇప్పటికే పూంఛ్‌రాజౌరీ సెక్టార్‌కు ఒక అదనపు బ్రిగేడ్‌ను తరలించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలి ఆపరేషన్లలో 20 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని కూడా ఆ వర్గాలు తెలిపాయి.

2019లో భారత ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాకిసాన్, చైనాలలో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని, కశ్మీర్‌లో ముఖ్యంగా జంట జిల్లాలయిన రాజౌరీ,పూంఛ్‌లలో సమస్యలు సృష్టించడానికి ఆ రెండు దేశాలు ప్రయత్నించాయని రిటైర్డ్ కల్నల్ అజయ్ కొత్యాల్ చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్థించడంతో ఆందోళనకు గురయిన ఈ రెండు దేశాలు మరోసారి జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి రాజేయడానికి ప్రయత్నించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భారత సైన్యం ఇప్పుడు చాలా బలంగా తయారైందని, సరిహద్దుల్లో శత్రు దాడులను సమర్థంగా తిప్పికొట్టే స్థితిలో ఉన్నాయని, అందువల్ల వారి పాచిక పారకపోవచ్చ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News