- Advertisement -
తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక, హైదరాబాద్ సిటిలోనూ గేణేష్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వినాయకుడి నిమజ్జనాలు కూడా మొదలయ్యాయి. ఈ నెల 17న నగరంలోని అన్ని గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు శోభాయాత్రగా ట్యాంక్ బండ్ వైపు కదులుతాయి. ఈ శోభాయాత్రను చూసేందుకు భారీగా ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు వస్తారు.
ఆ రోజున పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది.
- Advertisement -