Wednesday, October 9, 2024

బైక్ పై లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

చెన్నై: బస్సు కోసం వేచి చూస్తున్న మహిళకు ఇద్దరు యువకులు బైక్ పై లిఫ్ట్  ఇచ్చి, మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలోకి ఆమెపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం పాల్పడిన సంఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పూతలూరులోని ఓ బస్టాండులో 3వ తేదీ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుండగా  ప్రవీణ్, రాజ్ కుమార్ అనే ఇద్దరు యువకులు బైకులపై వచ్చి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు.  దీంతో బైక్ పై వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తరువాత ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News