Monday, April 29, 2024

రైతు బంధు డబ్బులు విడుదల చేయాలి

- Advertisement -
- Advertisement -

అమరచింత : తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయగా డ బ్బులు తీయడానికి వీలు లేకుండా బ్యాంక్ అకౌంట్‌లోను హో ల్డ్‌లో ఉంచడానికి నిరసనగా గురువారం అమరచింత పట్టణంలోని కిసాన్ కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కార్యదర్శి ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ పంట రుణమాఫీ చేయలేదని, రైతు బ ంధు పేరుతో ప్రభుత్వం ఒకవైపు పంట పెట్టుబడుల కోసమని రైతు ఖాతాలో డబ్బులు వేస్తూనే మరోవైపు బ్యాంకులలో రుణా లు చెల్లించాలనే కారణంలో రైతుల ఖాతాలను హోల్డ్‌లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో బ్యాంకులలో వడ్డీల మీద వడ్డీలు పెరిగి రైతుల అప్పులు రెట్టింపయ్యాయన్నా రు. కెసిఆర్ చేసిన మోసంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లా డి ఖాతాల హోల్డింగ్‌ను తీయించి రైతులకు సాయం అందేలా చూడాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో యువజన కాం గ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రామ్ సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అమరచింత మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, అమరచింత పట్ట ణ అధ్యక్షుడు అరుణ్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షు డు లక్ష్మికాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తులసిరాజు, నియోజకవర్గ సోసల్ మీడియా కో ఆర్డినేటర్ తౌఫిక్, బిసి సెల్ మండల అధ్యక్షుడు పోషిరిగారి విష్ణు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్యామ్, ఎస్సి సెల్ మ ండల అధ్యక్షుడు ప్రకాశం, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు హ న్మంత్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగు నాయక్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News