Sunday, April 28, 2024

నేడు బేలా ముత్యాలమ్మకు ఫలపుష్ప అలంకరణ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : శాలిబండ బేలా చందూలాల్ శ్రీమాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయంలో 55వ బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి అభిషేకం, లక్ష పుష్పార్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. 14వ తేదీ శుక్రవారం ఉదయం అభిషేకం, 13 రకాల ఎండు ఫలాలు, 12 రకాల పండ్లతో ఫల పుష్ప అలంకరణ, 56 రకాల నైవేద్యాలు (చప్పన్‌భోగ్), సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం వారిచే శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మకు పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందని అధికారులు తెలిపారు.

15వ తేదీ శనివారం ఛండీ హవనం, సాయంత్రం బేలా చౌరస్తా నుండి అమ్మవారి తొట్టెల ఊరేగింపు, 16వ తేదీ ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు బోనాల సమర్పణ, మధ్యాహ్నం పోతరాజు కార్యక్రమం, రాత్రి ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 17వ తేదీ ఆదివారం ఉదయం అభిషేకం, అలంకరణ, ఉదయం 11 గంటలకు పోతరాజు గావు, మధ్యాహ్నం 12గంటలకు రంగం ఉంటుందన్నారు.

అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు 40 అడుగుల పూల రథంపై అష్టలక్ష్మీలు, మాతేశ్వరి ఘటంపై ఊరేగింపు ఉంటుందని, తమిళనాడు, విజయవాడకు చెందిన నాలుగు శకటాలు, వంద మందికిపైగా కళాకారులు, మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుండి రప్పించిన సాంప్రదాయ వాయిద్యాం, ఆలేరు డోలు డప్పు కళాకారుల ప్రదర్శనల మధ్య అమ్మవారి భవ్య రథయాత్ర లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చార్మినార్, పత్తర్‌గట్టి, మదీనా మీదుగా నయాపూల్ ఢిల్లీ దర్వాజ మూసినది ఉడ్డున గల శ్రీ మహంకాళి దేవాలయానికి చేరుకుంటుందని ఆ ఆలయ చైర్మన్ పొటేల్ కృష్ణ యాదవ్, అధ్యక్షులు పొటేల్ సదానంద్ యాదవ్‌లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మాతేశ్వరి ముత్యాలమ్మ అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పొటేల్ రాము యాదవ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, పొటేల్ వరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News