Monday, April 29, 2024

ఇంగ్లండ్‌కు చావో రేవో

- Advertisement -
- Advertisement -

The third Test of the Ashes from tomorrow

మెల్‌బోర్న్: వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు ఆదివారం ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడో టెస్టు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లండ్‌కు నెలకొంది. మరోవైపు ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా సమరోత్సాహంతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో పాట్ కమిన్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కిందటి మ్యాచ్‌లో అతను జట్టుకు దూరమయ్యాడు. ఇక స్మిత్ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇంగ్లండ్ సిరీస్ కోల్పోవడం ఖాయం. దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా బలంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం ఇంగ్లండ్‌కు తేలికేం కాదు. అసాధారణ ఆటను కనబరిస్తేనే రూట్ సేనకు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News