Saturday, April 27, 2024

యాషెస్‌తో కొత్త జోష్

- Advertisement -
- Advertisement -

లండన్ : చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ 22తో సమమైన విషయం తెలిసిందే. సంప్రదాయా టెస్టు క్రికెట్‌కు ఐదు మ్యాచ్‌ల యాషెస్ సమరం కొత్త జోష్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు ఆస్ట్రేలియా అటు ఇంగ్లండ్‌లు యాషెస్‌లో సర్వం ఒడ్డి పోరాడాయి. ఐదు మ్యాచ్‌లు కూడా చివరి వరకు ఉత్కంఠభరితంగానే సాగాయి. టెస్టు క్రికెట్‌కు ఈ సిరీస్ కొత్త జీవం పోసింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడినా ఇంగ్లండ్ మొక్కువోని ధైర్యంతో తర్వాత జరిగిన మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్‌ను డ్రా చేయడం విశేషం.

ఒక వేళ నాలుగో టెస్టు మ్యాచ్ వర్షం బారిన పడి ఉండకపోతే యాషె స్ సిరీస్ ఇంగ్లండ్‌కే దక్కేది. అయితే వరుణుడి వల్ల ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి నుంచి తప్పించుకుంది. ఊహించినట్టుగానే యాషెస్ సమరం ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడిచింది. ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్లు అసాధారణ ఆటతో అభిమానులను కనువిందు చేశా యి. మొదటి మ్యాచ్ నుంచే ఇరు జట్లు సర్వం ఒడ్డాయి. తొలి రోజు నుంచే ప్రతి మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ వచ్చింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున జో రూట్, ఆస్ట్రేలియా టీమ్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సెంచరీలతో అలరించారు.

282 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఈ దశలో పాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ మ్యాచ్‌లో కమి న్స్ అజేయంగా 44 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. రెండో టెస్టు కూడా హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందు కు ఇంగ్లండ్ సర్వం ఒడ్డి పోరాడింది. అయితే కీలక సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీసి జట్టును గెలిపించారు. మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ టీమ్ 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. చివరికి విజ యం ఇంగ్లండ్‌ను వరించింది. నాలుగో టెస్టు లో కూడా కూడా ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. లబుషేన్ చిరస్మరణీయ సెంచరీతో ఆస్ట్రేలియాను ఓటమి నుంచి రక్షించా డు. చివరి రెండు రోజుల ఆటకు వర్షం అడ్డంకిగా మారడం కూడా ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఇక ఆఖరు టెస్టు కూడా చివరి వరకు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం ఇరు జట్ల మధ్య దోబుచలాడింది. అయితే చివరికి ఇంగ్లండ్ జయకేతనం ఎగుర వేసింది. దీంతో సిరీస్ 22తో సమమైంది.

ఈ సిరీస్‌లో రూట్, స్మిత్, ఖ్వాజా, లియాన్, బ్రాడ్, క్రాలీ, బ్రూక్, లబుషేన్, హెడ్, స్టార్క్, బ్రాడ్, వోక్స్, కమిన్స్, మార్క్‌వుడ్, లియాన్ తదితరులు అద్భుత ఆటతో ఆకట్టుకున్నారు. ఇక కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌కు ఐదో చివరి టెస్టు తీపి జ్ఞాపకంగా మిగిలింది. తన ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొట్టిన బ్రాడ్, ఆఖరు బంతికి వికెట్ తీసి అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News