Monday, May 6, 2024

మరో మూడ్రోజులు వర్షాలే..

- Advertisement -
- Advertisement -

12 జిల్లాలకు రెడ్ అలెర్ట్
హైదరాబాద్ వాతావరణ శాఖ

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ,ఈశాన్య జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు ,మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటలు 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు వివరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో ఆలర్ట్ జారీ ప్రకటించింది.

గడిచిన 24గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 83.2 మి.మి వర్షం కురిసింది. మార్పెల్లిలో 78.8, కోటపల్లిలో 64.8,పినపాకలో 55.8, అశ్వారావు పేటలో 54.8, గూడుర్‌వర్గల్‌లో 52.2, ఘనపూర్‌లో 51.4, భద్రాచలంలో 50.1 ముల్కలపల్లిలో 50.2, కూసుమంచిలో 46.8, నిజామాబాద్‌లో 46.8, ్రగ్రేటర్ హైదరాబాద్‌లో 45.8, కోటగిరిలో 45.2, మొమిన్‌పేటలో 44, తామ్సిలో 42.2, జులపల్లిలో 42, బాలనగర్లో 41.4, ఎల్లారెడ్డిపేటలో 40.2, మహబూబాబాద్‌లో 39.8, సుల్తానాబాద్‌లో 39.2, బిర్కూర్‌లో 38.4, మల్కూర్‌లో 38.2, దర్మారంలో 37.4, బోధ్‌లో 37, నిర్మల్‌లో 36. మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News