Friday, September 19, 2025

చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతి.. బాలుడు గల్లంతు

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలు, ఒక యువతి, ఒక బాలుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఆదివారం గ్రామంలో ఉన్న ఎస్సీలంతా గ్రామ దేవతలకు బోనాల పండగ నిర్వహించారు. గ్రామానికి చెందిన చంద్రయ్య కుటుంబం కూడా బోనాల పండగ నిర్వహించగా ములుగు మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన సమీప బంధువులు ఇంటికి బోనాల జాతరకు వచ్చారు. సోమవారం చంద్రయ్య కూతురు లావణ్య (19), వీరి బంధువులైన లక్ష్మీ(25), బాలమణి (30), కుమారుడు చరణ్ (10)లు బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వెళ్లారు.

మొదట చరణ్ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో మునిగిపోవడంతో చరణ్‌ను కాపాడటానికి తల్లి బాలమణి నీటిలోకి దిగి మునిగిపోయింది. ఇది గమనించిన లక్ష్మి, లావణ్యలు ఒకరి వెనక ఒకరు చెరువులోకి దిగడంతో ఇద్దరు మహిళలు కూడా నీట మునిగి మృతి చెందారు. ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులకు గ్రామస్థులకు తెలియడంతో హుటహూటిన చెరువు వద్దకు వెళ్లి నీట మునిగిన లక్ష్మీ, బాలమణి, లావణ్యల మృతదేహాలను వెలికితీశారు. బాలుడు చరణ్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పీ, సీఐ శ్రీధర్, స్థానిక ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News