Sunday, April 28, 2024

జామియా బయట దుండగుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

Jamia university

 

న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని కొందరు దుండగులు జామి యా 5వ నంబర్ గేటు బయట ఆదివా రం రాత్రి కాల్పులు జరిపారని జామియా సమన్వయ కమిటీ (జెసిసి) తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా ఆందోళన చేయడాని కి విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థు లు, ప్రస్తుత విద్యార్థులతో జెసిసి ఏర్పడింది. ‘దాడి చేసినవారు 1532 లేదా 1534 నంబరున్న ఎర్రటి స్కూటీపై వ చ్చారని, దుండగుల్లో ఒకరు ఎర్రటి జా కెట్ వేసుకున్నాడని కమిటీ పేర్కొంది.

అయితే, ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు’ అని జెసిసి ఒక ప్రకటనలో చెప్పి ంది. జెసిసి ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన రాత్రి 11.30 గంటల ప్రాం తంలో జరిగిందని ఒఖ్లా కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ ఆసిం మహమ్మద్‌ఖాన్ చెప్పా రు. ‘మేము తుపాకీ కాల్చిన చప్పుడు వి న్నాం. ఏం జరిగిందో చూద్దామని వచ్చా ం. ఓ స్కూటీపై ఇద్దరు వెడుతూ కనిపించారు. వెహికిల్ నంబర్ నోట్ చేసుకొని పోలీసుల్ని పిలిచాం’ అని విద్యార్థి చెప్పాడు.

ఇది మూడోసారి
జామియా నగర్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కాల్పులు జరగడం ఇ ది మూడోసారి. గురువారంనాడు రాజ్ ఘాట్ వైపు వెడుతున్న ‘కా’ (సిఎఎ) వ్య తిరేక ఆందోళనకారులపై ఒక మైనర్ కా ల్పులు జరిపాడు. రెండు రోజుల తర్వా త జామియా నగర్‌లోని షాహీన్‌బాగ్‌లో 25 ఏళ్ల వ్యక్తి గాలిలోకి రెండు రౌండ్లు కాల్చాడు. అయితే ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.

భయపడం, ఆందోళన ఆపం
ఆదివారం రాత్రి సంఘటన ఈ ప్రా ంతంలో భయాందోళనలు కలిగించిం ది. సంఘటన తర్వాత అక్కడికి చేరుకు న్న పోలీసులు విద్యార్థులు ఆగ్రహంతో తరిమేశారు. విశ్వవిద్యాలయం వెలుప ల వందలాది మంది విద్యార్థులు, స్థానికులు యూనివర్శిటీ బయట గుమికూడారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ని నాదాలు చేశారు. జామియానగర్ పోలీ స్ స్టేషన్ బయట వారు ధర్నా చేశారు. ఇలాంటి సంఘటనలకు భయపడి మేం వెనక్కు తగ్గం. మా ఆందోళనను కొనసాగిస్తాం’ అని జెఎంఐ విద్యార్థి షేజాద్ అహ్మద్ చెప్పారు.

 

Thugs shoots outside Jamia university
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News