Wednesday, April 17, 2024

కోట్లు కొల్లగొడుతున్న టిల్లు స్క్వేర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజె టిల్లు అనే సినిమా చిన్నగా వచ్చి సక్సెస్ సాధించింది. డిజె టిల్లు మూవీ యూత్‌కు ఆకట్టుకోవడంతో ఘనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిద్దు జోన్నలగడ్డ నటించారు. టిజి టిల్లుకు సీక్వెల్‌గా ‘టిల్లు స్వ్కేర్’ సినిమాను విడుదలు చేశారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా వసూళ్లతో కోట్లు రాబడుతోంది. ఈ చిత్రంలో జొన్నలగడ్డ సిద్దుకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఫార్చూన్ ఫోర్ సినిమా, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించగా శ్రీ చరణ్, రామ్ మిరియాల, థమన్ సంగీతం అందించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్ ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించారు. అ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు రూపంలో కొల్లగొడుతోంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులు అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులలలో రూ.2.8 కోట్లు షేర్ వసూలు చేయగా వరల్డ్ వైడ్‌గా రూ. 3.5 కోట్లు కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి రూ.85 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News