Saturday, April 27, 2024

‘టిల్లు స్క్వేర్’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన ‘డిజె టిల్లు‘ సినిమాతో ‘టిల్లు‘గా ప్రేక్షకులపై పెద్ద ప్రభావాన్ని కలిగించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది. ప్రకటన వచ్చినప్పటి నుండి, ‘టిల్లు స్క్వేర్’ సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ‘టిల్లు‘గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తూ, టిల్ స్క్వేర్ కోసం రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని ‘టికెట్టే కొనకుండా‘, ‘రాధిక‘ వంటి పాటలు ఇప్పటికే వైరల్ చార్ట్‌బస్టర్‌లుగా మారాయి.

కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సినిమాలోని ఆమె ‘కిల్లర్‘ లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News