Wednesday, September 18, 2024

తమిళనాడు బిజెపి కార్యదర్శి అరెస్టు..15 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్యకు 15 రోజుల జుడిషియల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం రాత్రి పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు.

కాగా..ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వం హరించే యత్నంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అణ్ణామలై అభివర్ణించారు. అయితే పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో సూర్య పెట్టిన పోస్టుపై సిపిఎం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐటి చట్టంతోపాటు ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద సూర్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూర్య అరెస్టును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ట్విట్టర్ వేదికగా ఖండించారు. డిఎంకె మిత్రపక్షమైన కమ్యూనిస్టుల ద్వంద్వవైఖరికి ఇదే నిదర్శనమని, భావప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని అణ్ణామలై దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News