Sunday, September 15, 2024

బుధవారం రాశి ఫలాలు(07-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న అటువంటి వారికి అనుకూలమైన సమయం.  కుటుంబం నందు ఇతరుల అతి జోక్యం ఇబ్బందులు కలిగిస్తుంది.

వృషభం – చేపట్టిన పనులు త్వరలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథునం –  పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమంను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

కర్కాటకం – కీళ్ల నొప్పులు మానసిక ఆందోళనలు. అధిక ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలోని ఖర్చులను తగ్గించుటకు చేసే యత్నములు బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి.

సింహం – ఆర్థిక వ్యవహారములు లాభిస్తాయి. ఋణ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారములు మూడు వంతులు మీకే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.

కన్య – బంధువులకు సంబంధించి కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది. నిందారోపణలకు స్థిరపడి కొన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. స్త్రీల వలన కొన్ని ప్రయోజనములు లభిస్తాయి.

తుల – కుటుంబం నందు ముఖ్య అనుబంధం కలిగిన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదర సోదరి వర్గీయుల నుండి సన్నిహితుల నుండి వినూత్న రీతిలో రాజి యత్నములు వస్తాయి.

వృశ్చికం – కొన్ని ప్రయోజనములను అందరితో కలిసి పంచుకొనుటకు సిద్ధపడతారు. కుటుంబ, బంధు  సంబంధిత స్నేహితుల వర్గముల వారికి సంబంధించిన విషయాల్లో సర్దుకుపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

ధనుస్సు – ఏకాగ్రతకు భంగం కలిగేటువంటి విధంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అన్నిటికీ కూడా మీరే కారణం అని నిందించే వ్యక్తులు తారసపడతారు. వీరి నుంచి జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన.

మకరం – మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఆలోచనలతో మీ మనసును ఆందోళనకు గురి చేయకండి.

కుంభం – ఆర్థిక సంబంధిత విషయముల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దలతో సంభాషించినప్పుడు సమయమును పాటించడం మేలైన అంశం.

మీనం – వృత్తి అందు బాధ్యతలు అధికమగుట వలన శరీరం అలసటకు గురి అవుతుంది. శుభకార్యములకు బహుమతులకు ధనమును అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News