Tuesday, September 10, 2024

హైడ్రా ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఒకే చెరువులోని 52 అక్రమ కట్టడాలను తొలగించి ఆక్రమణలపై హైడ్రా కన్నెర్రచేసింది. నగర శివారులోని గాజులరామారాం చింతల్ చెరువులో మంగళవారం ఒకే రోజు 52 నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా ఆక్రమణదారుల్లో వణుకుపుట్టించింది. జీహెచ్‌ఎంసి, ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపున్న చెరువుల సంరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( హైడ్రా) రంగంలోకి దిగుతూనే తన విధులను చాటుకుంది. ఇటీవల లోటస్‌పాండ్ వద్ద పార్కును ఆక్రమిస్తూ ఏర్పాటుచేసిన ప్రహారీని కూల్చివేసి తన చర్యలకు శ్రీకారం చుట్టిన హైడ్రా ఇప్పుడు చెరువుల్లోని ఎఫ్‌టిఎల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించింది. ప్రత్యేకంగా అధికారులతో సమావేశాలను నిర్వహిస్తూ.. చెరువులను తనిఖీలు చేస్తూ.. నిర్మాణాలను గుర్తిస్తూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఓ ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటోంది హైడ్రా.

విచారించాకే..
చెరువులు నీటి వనరులుగానే ఉండేలా, వాటి చుట్టూ వచ్చే నిర్మాణాలను తొలగించేలా ముందస్తుగా చెరువుల వద్దకు అధికారులతో కలిసి వాటి విస్తీర్ణం, ఎఫ్‌టిఎల్ హద్దులు, బఫర్ జోన్ పరిధిని హైడ్రా గుర్తిస్తుంది. హైడ్రా కమిషనర్‌గా ఐజి రంగనాథ్ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి వరుసగా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. ఐజి రంగనాథ్ నేరుగా చెరువుల వద్దకు అధికారులను తీసుకొని వెళ్తూ నియమనిబంధనలకు విరుద్దంగా ఉన్న అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిందంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. చెరువుల పునరుద్దరణ చేయడంతో పాటు,

నీటి వనరుల పరిరక్షణతో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దేవేందర్ నగర్, గాజులరామారం చింతల చెరువు బఫర్ జోన్ తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు పుల్ ట్యాంక్ లెవెల్ (ఎల్. టి. ఎఫ్ ) పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలను చేపట్టినట్టు స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అధికారుల ఆదేశాల మేరకు ఆర్. ఫ్. ఓ పాపయ్య నేతృత్వంలో, డీస్పీ శ్రీనివాస్, ఇన్స్ స్పెక్టర్ బాల్ రెడ్డి సహకారం, హైడ్రా విభాగం మార్షల్స్, డి. ఆర్. ఎఫ్ బృందాలతో చెరువులోని అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News