Thursday, December 7, 2023

సోమవారం రాశి ఫలాలు(06-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – చిన్న చిన్న అవసరాలకు గాను అధికంగా శ్రమించవలసి రావడం వలన ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్ర వర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

వ్యషభం – కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.

మిథునం – రచనా వ్యాసంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. హోదాలను పెంచే ఒకానొక సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మెళకువలు పాటించండి. వాహన సౌఖ్యం గొచరిస్తున్నది.

కర్కాటకం – కుటుంబంలో ఇతరుల జోక్యం అవ్రశాంత వాతావరణానికి కారణమవుతుంది. మొహమాటాలకుపోయి కొన్ని కార్యక్రమాలను నిర్వహించవలసి వస్తుంది. చేబదుళ్ళు అధికంగా చేస్తారు.

సింహం – ఉన్నతాధికారులకు బహుమతులను అందించడానికి గాను చిన్నపాటి కొనుగోళ్ళను సాగిస్తారు. అవసరాలను పరిగణలోకి తీసుకుని ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలను చేపడతారు.

కన్య –  చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పును సాధిస్తారు. వృత్తి-ఉధ్యోగాలపరంగా ఆధిక్యతను కలిగి ఉంటారు.

తుల – ఉత్తర ప్రత్యుత్తరాల వలన శుభవార్తలను అందుకోగలుగుతారు. సామాజికంగా మీ వ్యక్తిగత హోదాను పెంపొందిచుకోవడానికి చేసే ప్రయత్నాలలో స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు.

వ్యశ్చికం – జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలను రూపుమాపుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. దైవ చింతన కలిగి ఉంటారు.

ధనుస్సు – కాంట్రాక్టుదారులకు శ్రమ మీద ఫలితాలు సానుకూల పడతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం చెప్పదగినది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభ నూచన.

మకరం – ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. యదార్ధవాదిలోక విరోధి అన్న నానుడి మీ అనుభవం లోనికి వస్తుంది. సామాజిక సేవలో పాల్గొని ఔదార్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చకుంటారు.

కుంభం – అదృష్టానికి దగ్గరగా రోజులు నడున్తున్నట్లు భావిస్తారు. ఇ-మెయిల్స్‌, ఉత్తర ప్రత్యుత్తరాలు వంటివి నకాలంలో సరిచూసుకోవడం చెప్పదగిన సూచన. రహస్య ఆలోచనలు ప్రణాళికలు ప్రధాన ప్రస్తావనాంశాలవుతాయి.

మీనం – ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. ప్రజా సంబంధాలు పెంచుకొనడానికిగాను చేసే ప్రయత్నాలు సూత్రప్రాయంగా ఉంటాయి. ఉన్నత విద్యాభ్యాసానికి గాను బ్యాంక్‌ బుణాలు మంజూరవుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News