Monday, May 6, 2024

గురువారం రాశి ఫలాలు(15-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వ్యషభం –బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం.

మిథునం –రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ

కర్కాటకం –మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు.

సింహం –ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పై చేయి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య –వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

తుల –బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తు సేకరణ.

వ్యశ్చికం –ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. వాహన యత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు –వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగులలో స్థాన మార్పులు వుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మకరం –ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

కుంభం –ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభంపొందుతారు.

మీనం –జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News