Sunday, April 28, 2024

సామాజిక సేవా పథకంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్‌కు 27 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

నేడు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోనున్న నేతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక సేవా పథకంలో నేటితో ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇరవై ఏడేళ్ల వసంతంలోకి చేరింది. తరుచూ హెల్త్ క్యాంపులను, హెల్త్ కేర్‌ను, నిరంతర రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు గండిపేటలో విద్యను కూడా అందిస్తూ ఒక పాఠశాలను నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఎన్‌టిఆర్ సుజల పేరిట పలు గ్రామాలకు తాగునీటిని అందించింది. కోవిడ్ 19 సందర్భంలోనూ పలు రీలీప్ యాక్టివిటీస్‌ను నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.

పలు సందర్భాలలో ఎన్‌టిఆర్ సంజీవని పేరిట ఉచిత హెల్త్ క్లినిక్‌లను కూడా నిర్వహించింది. ఇలా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్ననలు అందుకుంది. ఈ క్రమంలో 27వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నేడు గురువారం ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గం లకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ సిఈఓ కె. రాజేంద్ర ప్రసాద్ , సిఓఓ అడుసుమిల్లి . గోపి , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు చేతుల మీదగా బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు కేక్ కట్ చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News