Friday, July 11, 2025

నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం తెలిపారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని సనోఫి హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆవరణలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇట్టి కార్యక్రమంలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని, టిఎస్ ఐపాస్‌ద్వారా పరిశ్రమల స్థాపనకు సులభతరంగా ఇస్తున్న అనుమతులు తదితర విషయాలను ప్రస్తావించడం జరుగుతుందన్నారు. అంతేగాక సులభతర విధానం వల్ల రాష్ట్రానికి జిల్లాకి తరలివచ్చిన పెట్టుబడులు,స్థాపించిన పరిశ్రమలు, వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను తదితర అంశాలను వివరించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News