Sunday, August 3, 2025

వార ఫలాలు (03-08-2025 నుండి 09-08-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది లాభాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిరుధాన్య వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి ఆటోమొబైల్స్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ శ్రావణమాసంలో ప్రతి రోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు ఎల్లో.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో  విబేదిస్తారు. చేపట్టిన పనుల్లో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. శుభకార్యాలు వాయిదా పడతాయి. చేతి వరకు వచ్చిన సంబంధం చేజారిపోతుంది. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి,  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.  వ్యాపార పరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో ప్రతిరోజు పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు ఎరుపు.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జన్మరాశిలో గురువు బలంగా లేని కారణంగా మీరు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఇంటా బయట  అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలంగా చెప్పవచ్చు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి.  నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ శ్రావణమాసంలో మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో ప్రతిరోజు పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రముఖుల నుంచి అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు.  చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.  జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.  కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. మీరు లాభాలను ఆశించి పెట్టుబడి పెట్టినటువంటి ఒక రంగంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. గో సేవ చేస్తారు. మీరు కోరుకున్న స్థాయిని సాధించడానికి అహర్నిశలు కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు

కన్య:    కన్యా రాశి వారికి  ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా మీరు ఆశించిన రీతిలో ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి.  ఎంతోకాలంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారికి ఈవారం ఒక మంచి సంబంధం కుదురుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మీరు శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని మొగిలి పువ్వు కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి సారు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.  నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండండి. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలు, సబ్సిడీలు చేతికి అందుతాయి. మీకు అంది వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా మీ తెలివితేటలతో ఉపయోగించుకోండి మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు ఎల్లో. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో కష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి.

తుల:  తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా సందర్భాలలో మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో  పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి   నిపుణుల సలహాలు తీసుకుంటారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక  సమస్యల నుంచి బయటపడతారు. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని మొగలి పువ్వు కుంకుమతో కుబేర కుంకుమతో ప్రతిరోజు పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు.  ప్రతిరోజు కూడా లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. మీకు ఎంతో మేలు చేస్తుంది గోశాలకు మీ వంతు సహాయం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ  వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.  దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు.  వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు సమానంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవసరానికి మించి డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సినిమా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు తీర్పులలో మీ శత్రువర్గంపై మీరు విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విజయమే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ఈ  శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు లైట్ రెడ్.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది.  ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. చాలా విషయాలలో మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.  ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి.  ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి. దేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ  వారం  చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ స్థానంలో రాహువు  ఉండటం వలన  ఖర్చుల పరంగా ఉద్యోగ పరంగా సంపాదనపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని బందులు ఉంటాయి. జాగ్రత్త పడాలి  డ్రైవింగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ వ్యాపారం అంతగా కలిసి రాదు. కుటుంబ పరంగా విభేదాలు తొలగిపోతాయి. ప్రభుత్వం నుంచి  పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.  సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనే  ప్రయత్నాలు ఫలిస్తాయి.  కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ప్రతి రోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.  విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా మంచిగా ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశి వారు ప్రతి రోజు మొగలిపువ్వు కుంకుమతో కుబేర కుంకుమ తోటి అమ్మవారిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. ఏ పని మొదలుపెట్టినా నిదానంగా సాగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.  సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడుతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.  ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయండి  లక్ష్మితా అమర వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.

మీనం: మీన రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చులు తగ్గుతాయి. రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి  వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.  ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ గడిచిన కొన్ని వారాలు కంటే ఈ వారం చాలా బాగుంటుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది కరుంగలి మాల మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు బ్లూ.

Rasi phalalu cheppandi

Today varaphalam

Today varaphalam

Today varaphalam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News