Monday, April 29, 2024

గురువారం రాశి ఫలాలు (25-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం – శ్రమాధికం ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం – ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

సింహం – సన్నిహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం నుండి ధనలాభం. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమతప్ప ఫలితం ఉండదు. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

తుల – నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలగును.

వృశ్చికం – అరుదైన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర కొనుగోలు.

ధనుస్సు – సమస్యల నుండి బయటపడతారు. ఆప్తులను కలిసి సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

మకరం – ఋణవత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఇంటిలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయం సహకారాలు అందుతాయి. ధన, వస్తు, లాభాలు.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు.

మీనం – ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో చురకుగా పాల్గొంటారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News