Saturday, April 27, 2024

ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభకు రానున్న ఆరు నెలల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన చర్యలను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అధికారుల బదిలీ ప్రక్రియపై ఉత్తర్వులను ఎన్నికల సంఘం జారీ చేసింది. శనివారం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణకు సంబంధించిన మరో ఉత్తర్వును ఇచ్చింది.

ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు అను సరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉన్నదని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 మందికి శిక్షణ ఇస్తారు. వీళ్లు కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఈవిఎంలు ఉన్నాయి..? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి. ఇంకా ఎన్ని కావాలి..? అనే అంశాలపైనా ఎన్నికల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది. మనతెలంగాణ ఈ నెల 5నుంచి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఎంసీహెచ్‌ఐర్డీలో ఐదు రోజుల ట్రైనింగ్ కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ 3 కోట్లకు చేరనున్న రాష్ట్ర ఓటర్ల సంఖ్య కార్యాచరణ వేగవంతం చేసిన ఈసీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News