Thursday, September 21, 2023

కర్ణాటకలో కుప్పకూలిన శిక్షణ విమానం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక లోని చామరాజనగర్ సమీపంలో గురువారం భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ శిక్షణ విమానం కుప్ప కూలింది. విమానం లోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్ ఉన్నారు. రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా ఈ విమానం బెంగళూరు లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలు దేరిందని, చామరాజనగర్ సమీపం లోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో కూలిపోయిందని వాయుసేన తెలియజేసింది. పైలట్లు భూమిక, తేజ్‌పాల్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై వాయుసేన విచారణకు ఆదేశించింది. ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News