Monday, June 5, 2023

బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా 16వ నంబర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. దెందులూరు ఎస్‌ఐ వీరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News