Thursday, May 2, 2024

‘కవచ్’ అంటే ఏమిటీ..? దీనివల్ల భారీ ప్రాణ నష్టం తప్పేదా?

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో ‘కవచ్’ వ్యవస్థను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ప్రమాదం జరిగిన ఈ మార్గంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది. కవచ్ అనేది ఒక యాంటీ కొలిజన్ సిస్టం. ఇదెలా పని చేస్తుందటే.. ఒక లోకో పైలెట్ (రైలు డ్రైవర్) రెడ్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా అలాగే రైలును నడిపినప్పుడు ఈ కవచ్ సిస్టమ్ అటోమేటిగ్గా రైలును అపేస్తుంది. అదేవిధంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు ప్రమాదం జరగకుండా ఈ కవచ్ కాపాడుతుంది.

రెడ్ సిగ్నల్స్ పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కవచ్ వ్యవస్థ గుర్తిస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందించి రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News