Saturday, July 27, 2024

కెకె, సురేష్‌రెడ్డి ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

 Rajya Sabha

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు స్థానాలకు ఇద్దరే బరిలో నిలవడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం
టిఆర్‌ఎస్ రాజ్యసభ్యులు కె.కేశవరావు,కెఆర్.సురేష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మాట్లాడుతూ దేశంలో అనేకసమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ లక్ష్యాలను జాతీయస్థాయిలో పూర్తి చేసేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు చెప్పారు. రాజ్యసభకు అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలోని అనేక పరిస్థితులను చక్కదిద్దేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు నిరంతరం శ్రమించనున్నట్లు చెప్పారు. దేశంలో తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిలో భాగస్వాములయ్యే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడేవిధంగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ గొంతు వినిపిస్తామన్నారు. తెలంగాణఅభివృద్ధి కోసం ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా గెలిపించిన శాసనసభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.కేంద్రంపై ఒత్తరిడి పెంచి రాష్ట్రానికి రావల్సిన నిధులను సాధించేందుకు తమ వంతుబాధ్యతలను నెరవేర్చనున్నట్లు చెప్పారు.

TRS candidates are unanimous elected to Rajya Sabha
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News