Home జోగులాంబ గద్వాల్ గద్వాల ఎమ్మెల్యేకు పితృవియోగం

గద్వాల ఎమ్మెల్యేకు పితృవియోగం

TRS Gadwal MLA Father Passed Away
సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్, శాసన సభాపతి, మంత్రులు

హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బండ్ల వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. ధరూర్ మండలంలోని బురేడిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఆంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్,షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బండ్ల వెంకట్రామిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.