Sunday, April 28, 2024

గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే

- Advertisement -
- Advertisement -

Nama-Nageswara-Rao

పల్లె ప్రగతి… అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. దేశానికి రాష్ట్రాలు పునాదిలాంటివని వ్యాఖ్యానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు అన్ని రంగాల్లో కేంద్రం చేయూతనందించాల్సిన అవసరముందని ఆయన వ్యా ఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం లోక్‌సభలో ఎంపి నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గాంధీజీ కల లు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిజం చేసి చూపించారన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా వేలా ది గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని నామా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. రైతుబంధు స్పూర్తితోనే కేంద్రం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నా రు. తెలంగాణలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా అనేక పథకాలు అమలు చేస్తోందన్నా రు. ఈ కార్యక్రమం ప్రస్తుతం యావత్ దేశానికే ఆదర్శఁ గా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా గత నాలుగేళ్ళ నుంచి ప్రతి గ్రామంలో ఇంటింటికి నీళ్ళు అందిస్తున్నామన్నారు.

భగీరథ స్పూర్తితోనే కేంద్రం జలజీవన్ మిషన్‌ను ప్రారంభించిందన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠదామాల నిర్మాణంతో పాటు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తోందన్నారు. తెలంగాణలోని 12,751 గ్రామాలకుగాను 12,705 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది పరిచామన్నారు. హరితహారం పేరుతో ఇప్పటి వరకు గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. అందులో 84 శాతం మొక్కలు బతికాయన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2024 నాటికి ఐదు ట్రిలియన్ల లక్షంగా పెట్టుకొన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన విధంగా ఇప్పటి వరకు 2.93 ట్రిలియన్ల అభివృద్ధి సాధించామని ఇంకా 2024 అనుకున్న లక్షం సాధించాలని అంటే ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఇంకా 16 శాతం అభివృద్ధి సాధించాలన్నారు.

అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుండి మద్ధతు రాష్ట్రానికి అవసరం ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి, రైతులు ఆదుకోవాలి అంటే తెలంగాణ ప్రభుత్వం అలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఒకే దేశం, ఒకే పన్ను అని పేర్కొన్నారని…. దీనిని అమలు చేస్తే మంచి జరుగుతుందని ఆశించి ప్రతి రాష్ట్రం ఈ నూతన పన్ను విధానాన్ని అమోదించడం జరిగిందన్నారు.

కాని రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారని నామా వ్యాఖ్యానించారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల విషయం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కోత విధించారని నామా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రత విషయంలో 370 బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు టిఆర్‌ఎస్ మద్దతు తెలపడం జరిగిందన్నారు.

మేడారంను జాతీయ పండగగా గుర్తించాలి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి టిఆర్‌ఎస్ ఎంపి బండా ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. ఈ జాతర అభివృద్ధికి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ బండా ప్రకాశ్ మాట్లాడుతూ, మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు కోట్లాది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల సిఎంలు కూడా సమ్మక్క, సారలమ్మను గతంలో దర్శించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గిరిజనుల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు.

TRS MP Nama Nageswara Rao speech in Lok Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News