Tuesday, May 7, 2024

పిఎన్‌బికి రూ.492 కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

PNB

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.492.28 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.246.51 కోట్ల లాభం నమోదు చేయడం గమనార్హం. ఈ త్రైమాసికంలో బ్యాంకు మొండి బకాయిల కోసం రూ.4,445.36 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం చేసిన రూ .2,565.77 కోట్లకు అదనంగా ఉంది.

2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ .15,967.49 కోట్లుగా ఉందని, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 14,854.24 కోట్ల రూపాయలుగా ఉందని పిఎన్‌బి స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఎన్‌పిఎలకు బ్యాంక్ రూ .4,445.36 కోట్లు కేటాయించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఈ కేటాయింపులు రూ .2,565.77 కోట్లుగా ఉన్నాయి. ఏకీకృత ప్రాతిపదికన 2019-20 బ్యాంక్ నికర నష్టం 501.93 కోట్ల రూపాయలు. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.249.75 కోట్ల నికర లాభం ఆర్జించింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) 16.30 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 16.33 శాతంగా ఉంది.

PNB Q3 net loss at Rs 492 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News