Monday, April 29, 2024

పోదాం పదే జాతర..

- Advertisement -
- Advertisement -

Medaram

 

మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే

4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం

వరంగల్ : మేడారం మహాజాతరను కనులారా చూసి తల్లుల ఆశీర్వాదం పొందడానికి భక్తకోటి జనం మేడారానికి చీమలదండుల్లా చేరుకుంటున్నారు. ఇప్పటికే మేడారం అడవులన్నీ జనజాతరగా మారిపోయా యి. ఎటు చూసినా కిలోమీటర్ల మేర భక్తజనం నిండిపోయారు. తల్లుల రాక కోసం భక్తజన కోటి నిరీక్షిస్తున్నారు.నాలుగురోజుల పాటు జాతరలోనే ఉండి తల్లుల దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎక్కడికక్కడే విడిది ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాజాతర కు వచ్చే భ క్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జాతరకు సిఎం కెసిఆర్ రూ.75 కోట్లను విడుదల చేసి శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. వాటిలో హరిత కాకతీయ హోటల్ లాంటి విడిది కాటేజీలన్ని కూ డా భక్తులకు అందుబాటులోకి తేవడంతో ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులతో పాటు జాతరకు వచ్చే ప్రముఖులు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఈ ఏర్పాట్లను వినియోగించుకుంటున్నారు.

బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రానుండడంతో అప్పటి వరకు ఎక్కడి భక్తులు అక్కడే సారల మ్మ రాకకోసం వేచి చూస్తున్నారు. బుధవారం ఉ దయం మహబూబాబాద్ జిల్లా గంగారం మం డలం పూనుగొండ్ల నుంచి సోమవారం పయనమై న పగిడిద్దరాజు మంగళవారం సాయంత్రానికి గు ండాల నుంచి పస్రా పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు. నేటి ఉదయం పస్రాకు చేరుకొని అక్కడి నుంచి మేడారం వనజాతర ద్వారం ద్వారా సమ్మక్క చిలుగలగట్టుకు చేరుకోనున్నారు. ఎదుర్కోళ్లు నిర్వహించి పెండ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్ని చేసిన తరువాత గద్దెకు చేర్చడానికి ఏర్పాట్లను వడ్డెలు పూర్తి చేశారు. ఆతరువాత సారలమ్మ అశేష జనవాహిని మధ్య కన్నెపల్లి నుంచి భారీ మేళతాళాలు, ఎదుర్కోళ్లతో బుధవారం సాయంత్రానికి గద్దెకు చేరనున్నారు. సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజు, చిన్నమ్మ నాగులమ్మ, సోదరుడు జంపన్నలు అదే సమయంలో గద్దెకు చేరుతారు. ఈ కార్యక్రమంతో జాతరలో మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది.

గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే జాతరకు మంగళవారం సాయంత్రం వరకు భక్తులు అశేషంగా ఆర్‌టిసి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో లక్షల సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం సాయంత్రం వరకు కొద్దిమేరకే భక్తులు ఉండిపోయారు. బుధవారం మొదటిఘట్టం ఆవిష్కృతమవుతున్నందున ఒకరోజులోనే లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకున్నారు. ఆదివాసీ బిడ్డలుగా పోరాట యోధులుగా చరిత్రకెక్కిన సమ్మక్క,సారలమ్మల దర్శనానికి ఆదివాసీ వారసత్వం అంతా కూడా మూకుమ్మడిగా కదలివచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు ఈ జాతరకు వస్తున్నారు.

చీమలదండుగా మారిన రహదారులు
తెలంగాణ కుంభమేళగా వర్ధిల్లుతున్న సమ్మక్క,సారలమ్మ జాతరకు దేశం నలుమూలల నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా ఆదివాసి ప్రాంతాలకు చెందిన భక్తులు విదేశాల్లో ఉన్నప్పటికి వారందరికి మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర పెద్ద పండుగగా భావిస్తారు. అందుకు ఆదివాసీలు ఎక్కడున్నా ఈ జాతరకు వారం రోజుల ముందే వచ్చి మేడారంలోనే గడుపుతారు. అదే పద్ధతిలో ఈ జాతరకు కూడా విదేశాల్లో ఉన్న ఆదివాసీలతో పాటు దేశంలోని దండకారణ్య ప్రజలు కూడా తరలివచ్చారు. బుధవారం మొదటి ఘట్టం ఆవిష్కృతం అవుతుండడం సారలమ్మ ఆగమనంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి భక్తుల వస్తున్నారు. హైదరాబాద్ నుంచి మేడారం వస్తున్న వాహనాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి క్యూలైన్ పద్ధతిలో హైదరాబాద్ నుంచి మేడారం వరకు లైన్ కట్టాయి. కేవలం 30 కిలోమీటర్ల వేగంతోనే వాహనాలు నడుస్తుండడం వల్ల జాతరకు వెళ్లే గంటల సమయం అనూహ్యంగా పెరుగుతుంది.

అదే తీరులో జాతరకు నలువైపులా ఉన్న మరికొన్ని రహదారుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా మహబూబాబాద్, వయా నర్సంపేట మీదుగా వస్తున్నారు. ఈ రహదారి కూడా క్యూలైన్‌లో మంగళవారం రాత్రికి రద్దీగా మారిపోయింది. మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నుంచివచ్చే భక్తుల వాహనాలు భూపాలపల్లి మీదుగా ఊరట్టం చేరుకొని, ఊరట్టం ద్వారా మేడారం జాతరకు భక్తులను చేర్చుతున్నారు. మరో రహదారి అయిన మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్ర ఆదివాసీ కారిడార్‌గా ఉన్న భక్తులంతా ఏటూరునాగారం ముళ్లకట్టు హైవే ద్వారా మేడారానికి చేరుతున్నారు. నలుదిశలో ఉన్న రహదారులన్ని మేడారం జాతరకు వన్‌వేగానే లక్షలాది మంది భక్తులు చేరుతున్నారు.

Today beginning of actual event in Medaram
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News