Sunday, April 28, 2024

సచివాలయ ప్రారంభానికి ఆహ్వానించలేదు : గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో నిర్వహించిన జీ 20 సన్నాహక సదస్సుల్లో భాగంగా సీ20 సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ప్రోటోకాల్ తీరుపై విమర్శలు చేశారు. భారతదేశం అన్ని రంగాల్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తోందన్నారు. కేవలం మాటల్లో చెప్పడం కాదని, అన్ని చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. కోవిడ్ టైంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. కొవిడ్ టైంలో తెలంగాణలో డాక్టర్లు కూడా వైరస్ భారిన పడ్డారని, తానూ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూశానని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మనం ఎన్నో సాధించామన్నారు

Also Read:మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

కేవలం ప్రేమతోనే మనమంతా కొవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోగలిగామన్నారు. ప్రధాన మోడీ నేతృత్వంలో మనం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నంబర్ వన్ ఎకనామిక్ పవర్‌గా ఇండియా మారుతోందని ఉద్ఘాటించారు. జీ20 ద్వారా ప్రపంచానికి ఇండియా లీడర్‌గా నిలుస్తుందన్నారు. కానీ, కొంతమంది కేవలం మాట్లాడుతారే తప్ప, పని చేయరంటూ బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. స్వామి వివేకానంద ఏం చెప్పారో, ఇప్పుడు అవన్నీ మోడి చేస్తున్నారని తెలిపారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని, అందుకు తగ్గట్టు పని చేయాలని సూచించారు. నాయకులు, అధికారులు, రాజ్ భవన్, అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News