Wednesday, May 22, 2024

మిథ్యగా మారిన మద్దతు ధర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /హైదరాబాద్: తడి ..తాలు .. తప్పల నేపంతో మార్కెట్లలో ధాన్యం రైతులు నిలువు దోపిడికి గురువుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కొందరు అధికారులను కిందిస్థాయి సిబ్బందిని పర్సెంటేజిలు ఎరగా వేసి లొంగదీసుకుని ధరల నిర్ణయంలో దళారులు తాము ఆ డింది ఆటా పాడింది పాటగా ధాన్యం విక్రయాలను శాసిస్తున్నారు. ఒక్కొ క్వింటాలు మీద రైతులు సుమారు నాలుగు వందల రూపాయల మేరకు నష్టపోతున్నారు. ఇటువంటి సంఘటనలు ఏ ఒక్క జనగామ మార్కెట్‌కే పరిమితం కాలేదు.

రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో యధేశ్చగా సాగుతూనే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమకోర్చి వేల రూపాయలు పెట్టుబడులు భరించి పండించిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రమంతటా 51లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరిపంటను సాగు చేశారు. గత రెండు వారాలుగా వరికోతలు ప్రారంభమయ్యాయి. రైతులు వరికోతల అనంతరం నేరుగా ధాన్యాన్ని విక్రయ కేంద్రాలుకు తెస్తున్నారు. ఈ సీజన్‌లో రైతుల నుంచి 75.45 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇందుకోసం హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొత్తం 71490 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకూ 5923 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 18.85కోట్ల గన్ని సంచులు అవసరం కాగా ఇప్పటివరకూ 14కోట్ల సంచులు అందుబాటులో ఉంచింది.

ఈ సంచులు 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకే సరిపోతాయి. ఇంకా 4.85కోట్ల గన్ని సం చులు అందుబాటులో ఉంచాల్సివుంది. కరీంనగర్, నిజామబాద్, వరంగల్, ఖమ్మం, నల్గగొండ తదితర జిల్లాల్లో వరికోతల పనులు జోరుగా సాగుతున్నాయి. గత రెండు రోజులుగా వర్షసూచనలతో పలు జిల్లాల్లో రైతులు వరికోతలు ముందుగానే చేపడుతున్నారు. కోసిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ధాన్యానికి కనీస మద్దతు ధరలను క్వింటాలకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2183 ప్రకటించింది. ధాన్యంలో 17శాతం తేమ మించకుండా ఉన్న ధాన్యానికి ఈ ధరలు ఇవ్వాల్సివుం ది. అయితే ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందని సాకులు పెడుతూ ధరలో కోతలు పెడుతున్నారు.

అంతే కాకుండ ధాన్యంలో మట్టిపెల్లలు, తాలు గింజలు, రంగు మారిన గింజలు ప్రమాణాల కంటే అధికశాతం ఉన్నాయని కూడా సాకులు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధరల నిర్ణయం కూడా అలవి మాలిన జాప్యం చేస్తున్నారు. మద్యాహ్నం 3గంటలకు సాయంత్రం 5గంటలకు బిడ్డింగ్ జరుగుతోంది. దళారులతో కుమ్మక్కయిన సిబ్బంది చేతివాటం చూపుతన్నారు. ధరలు నిర్ణయించి చీటీల మీద ధర రాసి రైతు చేతిలో పెడుతున్నారు. అప్పటికే నిరీక్షణతో నీరసించిన పోతున్న రైతులు చీటీ మీద రాసిన ధరచూసి బిక్కమొఖం వేస్తున్నారు. ధరగిట్టక పోయినా, మరుసటి రోజు వరకూ వేచి ఉండలేక తక్కువ ధరలకే తెగనమ్మాల్సి వస్తోంది. జనగామలో క్వింటాలు ధాన్యానికి రూ.1551నుంచి 1659వరకే ధరలు నిర్ణయించి చీటిలు రైతుల చేతిలో పెట్టారంటే వ్యాపారుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో బట్టబయలవుతోంది.

అధికశాతం కేంద్రాల్లో ఇదే తంతు నడుస్తోందన్న విమర్శమలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.కొన్ని కేంద్రాల్లో ధాన్యం తేమశాతం అధికంగా ఉందని చెప్పి క్వింటాలుకు నాలుగు కిలోల ధాన్యం అధికంగా తీసుకుంటున్నారు. తాలు గింజలు, మట్టిపెళ్లలు అధికంగా ఉన్నాయని సాకులు చెబుతూ జల్లెడ పట్టకుండానే క్వింటాలు రెండు కిలోలు ధాన్యం అదనంగా తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడికి గురి చేస్తున్న తీరు పట్ల రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. సిబ్బంది నిర్లక్షతన సహించబోమని హెచ్చరించారు. సిఎం హెచ్చరికలతోనైనా ధాన్యం కొనుగోలులో మోసాలకు చెక్ పడుతుందా అన్నది తేలాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News