Tuesday, April 30, 2024

ఈపిఎఫ్ వేతన పరిమితి పెంపు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉద్యోగులకు ప్రయోజనం దిశలో కేంద్రం ఈపిఎఫ్‌ఓ వేతన పరిమితిని పెంచాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పరిధిలో ఉన్న ఉద్యోగుల వేతన పరిమితిఇప్పటివరకూ ఉన్న రూ 15,000 నుంచి రూ. 21000కు పెంచాలని సంకల్పించినట్లు తెలిసింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తుది నిర్ణయం వెలువడవచ్చునని అధికారులు తెలిపారు. ఇప్పటివర కూ ఉద్యోగులను ఈ భవిష్యనిధి ఖాతాలో చేర్చేందుకు వేతన పరిమితి రూ.15వేలు ఉండేది. దీనిని ఇప్పుడు రూ 21వేల వారికి కూడా వర్తింపచేయాలనేదే కీలక విషయం అవుతోంది. 2014లో ఈ పరిమితిని అంతకు ముందటి వేతన సీలింగ్ రూ.1500 నుంచి రూ.15000కు పెంచారు.

తరువాత దీనిని విస్తరించలేదు. ఈ నిధి పరిధిలోకి తీసుకువచ్చే ఉద్యోగుల వేతన పరిమితిని పెంచడం వల్ల ఖజానాకు అత్యధిక భారం పడుతుంది. అయితే ఇదే సమయంలో సార్వత్రిక సామాజిక బాధ్యత కోణం కూడా కీలకం అవుతోంది. అర్హులైన ఉద్యోగులు ఇపి స్కీం పరిధిలో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను గత ఏడాది జూన్‌లో సరళీకృతం చేశారు. దీని వల్ల యాజమాన్యం నుంచి జాయింట్ రిక్వెస్ట్ లెటర్ లేకున్నా తమకు తాముగా ఇపిఎఫ్‌ఓలో చేరేందుకు మార్గం సుగమం చేశారు. ఈమేరకు గత ఏడాది జూన్‌లో సర్కులర్ విడుదల అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News