Monday, April 29, 2024

సంస్థకు ఎలాంటి కష్టం, నష్టం ఉండదు

- Advertisement -
- Advertisement -

ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసి బస్సులో నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో సంస్థకు ఎలాంటి కష్టం, నష్టం కానీ ఉండదని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో లాభం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు పది లక్షల మంది వరకు మహిళలు ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రోజుకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. ఏటా రూ.1500 కోట్లు నుంచి రూ.2000 కోట్లు వరకు నిధులు అయితే సరిపోతాయన్నారు. రాష్ట్రంలో రోజుకు 45 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, వారిలో మహిళలు 50 శాతం మంది ఉన్నారని దాదాపు 22 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారన్నారు. వారిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారు 10 లక్షల మంది ఉన్నారని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News